సైబర్ సిటీ న్యూస్ - లైఫ్ స్టైల్ / హైదరాబాద్ : మగువల మనసు దోచే వజ్రాలు పొదిగిన ఆభరణాలకు కేరాఫ్ గా స్టార్లా జ్యువెల్స్ నిలుస్తుందని ప్రముఖ రచయిత్రి, స్టార్లా జువెలర్స్అంబాసిడర్ సంజన సోమవరపు తెలిపారు. గురువారం గచ్చిబౌలిలోని లీ మెరిడియన్ భవనంలో తన స్టార్లా రెండవ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ఆమె ఘనంగా ప్రారంభించారు. వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలు, నెక్లెస్, వజ్రాల దుద్దులు లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయన్నారు.
చేతితో అమరిక... మేము తయారు చేసే డిజైన్లు చేతితో వజ్రాలు అమర్చుతామని, ప్రతివారికీ ఇవి సెట్ అయే విధంగా మేము ప్లాన్ చేసి డిజైన్ చేస్తున్నామన్నారు. వజ్రాల సెట్స్ అంటే స్టార్లా నే గుర్తించేలా చేయడం మా లక్ష్యమని సంజన సోమవరపు తెలిపారు.* తాజా సేకరణలైన ల్యాబ్-గ్రోన్ డైమండ్ సాలిటైర్లు, రోజువారీ చక్కటి ఆభరణాలు మరియు బెస్పోక్ బ్రైడల్ పీస్‌లు అందుబాటులో ఉంటాయి. స్టార్లా జువెలర్స్ డైరెక్టర్లు శశి సోమవరపు, రేఖ సోమవరపు తదితరులు పాల్గొన్నారు.
Cyber City NewsAdmin