సైబర్ సిటీ న్యూస్ - లైఫ్ స్టైల్ / హైదరాబాద్ : నార్త్ ఇండియన్ ఓరియంటల్ యూరోపియన్ తెలుగు వంటకాలు ప్రత్యేక అనుభవాన్ని కలిగిస్తున్న లైవ్-4 నోట్ సైబర్ సిటీ న్యూస్ (హైదరాబాద్): నగరానికి వచ్చే అతిధులకు మరిచిపోలేని ఆతిథ్యం ఇచ్చేందుకు లైవ్-4 నోట్ రెస్టారెంట్ హోటల్ హయత్ లో ప్రారంభమైంది. విభిన్నమైన రుచులతో వేడివేడి వంటకాలను ఆర్డర్ చేసుకొని ఇదే ఆరగించవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని హయత్ హోటల్ లో ప్రత్యేక సౌకర్యాలతో లైవ్-4 నోట్ రెస్టారెంట్ సిద్ధంగా ఉంది. ఇది లైవ్ కిచెన్స్ థియేటర్ గా రూపొందిన సరికొత్త రెస్టారెంట్. ఒకే చోట నాలుగు వైపులా లైవ్ కిచెన్లు ఉంటాయి. రెస్టారెంట్ లోపల లేదా బయట కూర్చుని తమకి ఇష్టమైన ఫుడ్ను ఆర్డర్ చేసుకోవచ్చు.
సరికొత్త రుచులు లైవ్-4 నోట్ కిచెన్ లో సరికొత్త రుచులను ఆస్వాదించవచ్చు. నార్త్ ఇండియన్, ఓరియంటల్, తెలుగు రుచులు, యూరోపియన్ వంటకాలను అతిథులకు లైవ్ కిచెన్ ద్వారా అందిస్తారు. ఆర్డర్ చేసిన ప్రతి వంటకం వారి ముందే తయారుచేసి వేడివేడిగా వడ్డిస్తారు. ఆహార ప్రియులకు ఈ థియేటర్ మరుపురాని అనుభవంగా మారనుంది. మర్చిపోలేని అనుభూతి లైవ్-4 నోట్ ఆహార ప్రియులకు మరిచిపోలేని అనుభూతిగా మిగలనుంది. క్యూ రేటెడ్ ఫుడ్ తో విభిన్న సంస్కృతులకు వేదికగా నిలవనుంది. హైదరాబాద్ కు వచ్చే ప్రపంచ స్థాయి అతిథులకు వైవిద్య భరితమైన రుచులను లైవ్ కిచెన్ ద్వారా అందించనున్నారు. హయత్ హైదరాబాద్ మేనేజర్ క్రిసెల్లె ఫెర్నాండెజ్, ఎగ్జిక్యూటివ్ చెఫ్ అలోక్ తదితరులు పాల్గొన్నారు.
NagAdmin