సైబర్ సిటీ న్యూస్ - జాతీయం / హైదరాబాద్ : దేశ రాజధాని పేలుడు తో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సోమవారం సాయంత్రం 6.52 గంటల సమయంలోఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 సమయంలో సుభాష్ మార్క్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద i 20 కారులో పేలుడు సంభవించింది. పేలుడుతో 9 మంది మరణించగా మరో 20 మందికి పైగా గాయపడినట్లుగా తెలుస్తోంది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చిత్రమైపోయాయి. సమీప ప్రాంతాల్లోని పేలుడు దాటికి వీధిలైట్లు పగిలిపోయి అందాకారం నెలకొంది. భారీ శబ్దంతో సంభవించిన పేలుడు తో సమీపం లోని వాహనాలకు నిప్పంటుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడడంతో ఏడు ఫైరింజలతో మంటలు ఆర్పుతున్నారు. గాయపడ్డ క్షతగాత్రులను సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు.
ఎర్రకోట వద్ద సంబందించిన పేలుడుపై సమగ్ర విచారణకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు. ఎన్ఐఏ, ఎం ఎస్ జి బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. సోమవారం ఎర్రకోట సందర్శనకు సెలవు కావడంతో భారీ ప్రాణ నష్టం తప్పినట్లు అయ్యింది. పేలుడు పై ప్రధాని మోదీ ఆరా తీశారు. అమిత్ షా కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పేలుడు ఘటనతో దేశంలోని ప్రధాన నగరాలతో పాటు పట్టణాలలో పోలీసులు ప్రకటించారు. విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. పేలుడు జరిగిన కొద్దిసేపటికి ఢిల్లీ పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Cyber City NewsAdmin