సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పహార్ (66) తో సహా ఆరుగురు మృతి చెందినట్లు డిజిసి ఏ అధికారికంగా ప్రకటించింది. తన నియోజకవర్గం లోని బారామతిలో బుధవారం ఉదయం బహిరంగ సభకు హాజరయ్యేందుకు ముంబై నుంచి ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్ లో బయలుదేరారు. ఆయన ప్రయాణిస్తున్న ఫ్లైట్లో సాంకేతిక లోపం చోటు చేసుకోవడంతో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేసేందుకు డీజీసీఏ అధికారులు ప్రయత్నించారు. ప్రయత్నాలు విఫలం కావడంతో ఉదయం 8 గంటలను 45 నిమిషాలకు ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ కావడం తో విమానం కుప్ప కూలింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు అలుముకున్నాయి. విమానం కాలి బూడిద కావడంతో ఘటన స్థలంలోనే ఆరుగురు చనిపోవడంతో మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
మహాయుతి కూటమిలో ఎన్సీపీ నుంచి డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ పనిచేస్తున్నారు. ఆర్థిక, ప్రణాళిక, క్రీడలు, మైనారిటీ అభివృద్ధి తదితర శాఖలను ఆయన నిర్వహిస్తున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అజిత్ పవార్ భార్య సునేత్ర, సోదరి సుప్రియ సూలే హుటాహుటిన బారామతికి బయలుదేరారు.
Cyber City NewsAdmin