సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : షాపుల ముందు పార్కు చేసిన బైక్లను చోరీ చేస్తున్న నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసినట్లు మాదాపూర్ ఎసిపి సిహెచ్ శ్రీధర్ రావు తెలిపారు. సంవత్సర కాలంగా రాయదుర్గం, చందానగర్, ఫిలింనగర్ ప్రాంతాలలో చోరీలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ కేసు వివరాలను వెల్లడించారు.
Also Read : సిబిఐ కి కరూర్ తొక్కిసలాట కేసు కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు
తాగుడుకు బానిసై... చోరీల బాట వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం మల్కాపూర్ కు చెందిన కటాయి రాములు (23) ను భార్య వదిలేయడంతో కొంతకాలంగా కూలీ పనులు చేస్తూ లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిసరాలలో ఉంటున్నాడు. మద్యానికి అలవాటైన రాములు డబ్బుల కోసం బైక్ చోరీల బాట పట్టాడు. ఆదివారం రాయదుర్గంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా చోరీ చేసిన బైక్ తో రాములు పట్టుబడ్డాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులో విచారించగా 14 బైకులు చోరీ చేసినట్టు అంగీకరించాడు. నిందితుడి నుంచి ఆరున్నర లక్షల విలువచేసే 14 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డి ఐ భూపతి, క్రైమ్ సిబ్బందిని ఎసిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం ఎస్హెచ్ఓ సిహెచ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Cyber City NewsAdmin