సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : సైబర్ సిటీ న్యూస్ ( హైదరాబాద్): దుర్గం చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీశారు. మాదాపూర్లోని దుర్గం చెరువులో గుర్తు తెలియని మృతదేహం నీటిపై తేలడాన్ని లైక్ పోలీసులు గుర్తించారు. 30-35 సంవత్సరాల వయసు గల యువకుని మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. మృతుని వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఉదయాన్నే పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
సీక్రెట్ లేక్ లో ఆత్మహత్యల పరంపర... ఐటీ కారిడార్ కు తలమానికంగా ఉన్న సీక్రెట్ లేక్ (దుర్గం చెరువు) ఆత్మహత్యలకు కేరాఫ్ గా మారింది. కోవిడ్ అనంతరం దుర్గం చెరువు పై కేబుల్ బ్రిడ్జి ప్రారంభం తర్వాత ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దుర్గం చెరువులోకి వెళ్లేందుకు ద్వారాలతో పాటు వాకింగ్ ట్రాక్ ఉంది. సందర్శకుల ముసుగులో వెలుతు కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దుర్గం చెరువులోని ఆత్మహత్యలు పోలీసులకు సవాల్ గా మారుతున్నాయి.
NagAdmin