సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : బాధిత కుటుంబ సభ్యులు ఏఐజి ముందు ధర్నా సైబర్ సిటీ న్యూస్(హైదరాబాద్): గచ్చిబౌలిలోని ఏ ఏజీ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. లివర్ ప్లాంటేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన వ్యక్తి సర్జరీ తర్వాత మృతి చెందారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రాణం పోయిందని, బిల్లు ఎక్కువగా వేశారని రోగి బంధువులు ఆందోళనకు దిగారు. మాదాపూర్ డిసిపి రీతు రాజ్ ఆందోళనకారులకు సర్దు చెప్పి కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు
ఇది ముమ్మాటికి నిర్లక్ష్యమే.... చింతల కు చెందిన మురళి (40) లివర్ చెడిపోవడంతో ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఆగస్టు 26న గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చేరారు. లివర్ను డోనర్ చేసేందుకు మురళి భార్య ముందుకు వచ్చారు. మొత్తం 35 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పగా అందుకు వారు అంగీకరించారు. ఆగస్టు 28న మురళికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. అప్పటినుంచి ఆయన పూర్తిగా కోలుకోకపోవడంతో ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆరోగ్యం క్షమించడంతో శనివారం రాత్రి మురళి మృతి చెందారు. ఆస్పత్రి యాజమాన్యం 49 లక్షల బిల్లు వేసింది. ఇప్పటికే 35 లక్షలు చెల్లించిన బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే మురళి మృతి చెందారని అధికంగా బిల్లు వేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే లివర్ కోసం మురళి కుటుంబ సభ్యులు జీవన్ డాన్ కు దరఖాస్తు చేసుకున్నారు. డాక్టర్లు ఆయన వయస్సు 40 కు బదులు 60 వేయడంతో డోనర్లు ముందుకు రాలేదని తెలిపారు. జీవన్దాన్ లో అవకాశం వస్తే 7 లక్షల బిల్లు తగ్గేదన్నారు. ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే జీవం దాన్లో అవకాశం కోల్పోయామన్నారు. ఇదిలా ఉంటే బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని రాయదుర్గం ఇన్స్పెక్టర్ సిహెచ్ వెంకన్న తెలిపారు.
NagAdmin