సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : గోవాలోని ఓ నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 25 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఉత్తర గోవాలోని ఆర్పోరాలో గల బీచ్ బై రోమియో లేని నైట్ క్లబ్ లో ఆదివారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో 25 మంది సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సబ్ ఇన్స్పెక్టర్ నవనీత్ గోల్టేకర్ ఫిర్యాదు మేరకు అంజనా పోలీసులు క్లబ్ యాజమాన్యం, పార్టనర్ మేనేజర్,ఈవెంట్ ఆర్గనైజర్ లపై కేసు నమోదు చేశారు. రోమియో లేని చైర్మన్ సౌరబ్ లూత్రా, గౌరవ లూత్రా లను నిందితులుగా పేర్కొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత కుటుంబాలకు ఏడు లక్షల ఎక్స్ గ్రేషియోను ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వము రెండు లక్షలు రాష్ట్ర ప్రభుత్వము ఐదు లక్షల పరిహారాన్ని ప్రకటించాయి. నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సభ విచారణకు ఆదేశించారు. గోవా రాజధాని పానాజీకి 25 కిలోమీటర్ల దూరంలో నార్త్ గోవాలో నైట్ క్లబ్ ఉంటుంది. క్లబ్ లకు ఇచ్చిన అనుమంతులలో సీఎం పాత్ర ఉందని, ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని గోవా కాంగ్రెస్ చీఫ్ పాట్కర్ డిమాండ్ చేశారు.
Cyber City NewsAdmin