సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పోస్టల్ బ్యాలెట్ నుంచి మొదలుకొని చివరి రౌండ్ వరకు అనిల్ యాదవ్ కొనసాగించారు. మొదటి రౌండ్లో 62 ఓట్లు వెనుకబడి గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 98988 ఓట్లు రాగా టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డి 17061 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు. అధికార పార్టీ కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అటు టిఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకొని హోరాహోరీగా ప్రచారం చేశారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులో అంతా తామై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఆయన భార్య సునీత పై సానుభూతి ఉంటుందని అంతా భావించారు. జూబ్లీహిల్స్ ఓటర్లు మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు పట్టం కట్టారు.
తమ పార్టీ గెలుపును కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో 100కు పైగా అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తామని ఆయన భీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలందరూ చూశారని విఆర్ఏస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మాగంటి సునీత చానా కష్టపడ్డారని, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు, ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మా ప్రచారానికి భయపడే అజార్ కు మంత్రి పదవి ఇచ్చారని, ప్రజాతీర్పు శిరోధార్యం అన్నారు. బీహార్ లో కాంగ్రెస్ ఉనికి కోల్పోయిందని టిఆర్ఎస్ కార్యకర్తలు నిరాశ పడవద్దని తిరిగి బంతిలా వస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలతోనే గెలిచిందని, నైతిక విజయం తమదేనని టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పేర్కొన్నారు.
Cyber City NewsAdmin