సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : మోంథా తుఫాన్ ఎఫెక్ట్ హైదరాబాదును తాకింది. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి కురుస్తున్న జడివానతో ఐటీ ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని ప్రధాన రహదారులు ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మోంథా తుఫాన్ ఎఫెక్ట్ తో జనజీవనం స్తంభించింది.
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంతో జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో రెండో జలాశయాల గేట్లు ఎత్తారు. మూసీ నది పరవాళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. మూసి పరివాహ ప్రాంతాల్లో ఎవరు సంచరించవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Cyber City NewsAdmin