సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : హఫీజ్పేట్ డివిజన్ పరిధిలో మురళీధర్ సొసైటీ కాలనీ లో పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ పర్యటించారు. నిత్యం డ్రైనేజి పొంగి పొర్లుతుంది అని ,ఔట్ లెట్ లేక డ్రైనేజి సమస్య తీవ్రమైనది అని, డ్రైనేజి సమస్యను పరిష్కరించాలని, సీసీ రోడ్లు వేయాలని, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరచాలని గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మురళీధర్ సొసైటీ కాలనీ లో నెలకొన్న డ్రైనేజి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని, డ్రైనేజి సమస్య కు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.
మ్యాన్ హోల్ నుండి మ్యాన్ హోల్ వరకు పూడిక తీసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఔట్ లెట్ సమస్య ను త్వరితగతిన పరిష్కరించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట మ్యాన్ హోల్స్ పునరుద్ధరించాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్నా డ్రైనేజి, రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరుస్తామని, వరద నీటి నిల్వ లేకుండా చూస్తామన్నారు. ఏ చిన్న సమస్య తలెత్తిన తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మురళీధర్ సొసైటీ కాలనీ వాసులు GS మూర్తి, శంకర్, దయాకర్ రెడ్డి, వరలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్, సుధాకర ఉన్నారు.
Cyber City NewsAdmin