సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : మియాపూ ర్ డిపో-1, బస్ బాడీలలో టీజీఎస్ ఆర్టిసి వైస్ చైర్మన్,MD . వై. నాగి రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. మియాపూర్ డిపో-1లో లహరి స్లీపర్, లహరి ఏసి స్లీపర్ కం సీటర్, రాజధాని, సూపర్ లగ్జరీ బస్సులను క్షుణ్ణంగా పరిశీలించారు. బస్సు లో అమర్చబడిన ఫైర్ సేఫ్టీ కి సంబంధించిన ఫైర్ డిటెక్షన్ అలారం, ఫైర్ డిటెక్షన్ సప్రేషన్ సిస్టంల పనితీరును అడిగి తెలుసుకున్నారు.
బస్సులలో ఫైర్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ ఎమర్జెన్సీ అలారం పనితీరును, అత్యవసర పరిస్థితులలో కిటికీ అద్దాలు పగలగొట్టడానికి గల డైమండ్ పాయింట్, సుత్తి, ఎమర్జెన్సీ తలపులు తెరుచుకొనే తీరుపై అధికారులను ప్రశ్నించారు. అత్యవసర సమయంలో పొగ వెళ్ళడానికి రెండు హచ్ లు కూడా ఓపెన్ చేసి చూసి అన్ని పరికరకలా పని తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రైవర్, కండెక్టర్, సిబ్బందికి పలు సలహా, సూచనలు చేశారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనతో తెలంగాణ ఆర్టీసీ అప్రమత్త మైయింది. స్వయంగా ఆర్టిసి ఎండి నాగిరెడ్డి రంగంలోకి దిగి బస్సుల ఫిట్నెస్ ను పరిశీలించడం గమనార్వం.
Cyber City NewsAdmin