సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి షేక్‌పేట్ డివిజన్ లోని ఓయూ కాలనీలో ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. యువతకు ఉద్యోగాలు, గృహ నిర్మాణ హామీలు, మహిళలకు భద్రత వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే, పారదర్శక పాలన కొనసాగాలంటే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలిపించాలన్నారు.బీజేపీ మాత్రమే ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు. అభివృద్ధి దిశగా భారత్‌ను ముందుకు తీసుకువెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం ప్రజల విశ్వాసం చూరగొన్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడం ప్రజలు బాధ్యత గా భావించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు శివ సింగ్ రాందీన్, సీనియర్ నాయకులు స్వామి గౌడ్, నరసింహరావు, అనిల్ గౌడ్, సంజీవ్, వరలక్ష్మి ధీరజ్, నరసింహ రాజు, నరేందర్ ముదిరాజ్, అశోక్, సురేష్, దుర్గారామ్, రాఘవేంద్ర, జితేందర్ సింగ్, విశాల్ సింగ్,స్థానిక బీజేపీ నాయకులు,బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Cyber City NewsAdmin