సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : ట్రాఫిక్ జామ్ తో ఐటీ ఉద్యోగులు నిత్య నరకం అనుభవిస్తున్నారు. కిలోమీటర్ల పొడవునా వాహనల రాకపోకలు నిలిచిపోవడంతో ఐటీ కారిడార్ లో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. ఎటువైపు చూసినా రోడ్లపై వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఐటీ కారిడార్ లోని రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నాయి. ఇళ్లకు వెళ్లేందుకు ఐటి ఉద్యోగులు నానా తంటాలు పడ్డారు.
రాయదుర్గం నుంచి మోహిదీపట్నం వైపు, బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ వరకు, గచ్చిబౌలి జంక్షన్ నుంచి హఫీజ్ పేట వైపు, సైబర్ జంక్షన్ నుంచి కూకట్పల్లి వైపు ట్రాఫిక్ జామ్ నెలకొంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లోనే గడిపారు. రోడ్లపైకి వస్తున్న వాహనాలకు తగ్గట్లుగా రోడ్ల విస్తరణ జరగకపోవడంతో ట్రాఫిక్ కష్టాలు షరా మామూలుగా మారాయి.
Cyber City NewsAdmin