సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : గోపనపల్లిలోని మద్యం బెల్ట్ షాపు వద్ద అర్ధరాత్రి గలాట చోటుచేసుకుంది. ఇరువర్గాలు బాబాయ్కి దిగాయి. వర్గం వారు ఇనుప రాడ్లతో దాడికి పాల్పడడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బీరు సీసా కు రూ.50 ఎక్కువగా చెప్పడంతో వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చందానగర్ పీఎస్ పరిధిలో గోపనపల్లి తండాలో నానక్రం కూడా చెందిన కార్తిక్, ప్రకాశం లో కొంతకాలంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
గురువారం రాత్రి ఎన్టీఆర్ నగర్లో ఓ స్థానిక నాయకుడు బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. అక్కడ మద్యం సేవించిన కొంతమంది అర్ధరాత్రి 2 గంటల సమయంలో బెల్ట్ షాపుకు వెళ్లారు. మీరు కావాలని అడగగా 50 రూపాయలు ఎక్కువ ఇవ్వాలని తెలపడంతో గొడవ దిగారు. బెల్ట్ షాప్ నిర్వాహకులను తోయడం, షాప్ పై దాడికి పాల్పడడంతో గొడవ ముదిరిపాకన పడింది. కార్తీక్, ప్రకాశం మరో నలుగురు ఇనుపరాట్లతో మద్యం మత్తులో ఉన్న వారిపై దాడికి పాల్పడ్డారు. గోపనపల్లికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తులు స్థానికుల అయిన తమపై దాడికి పాల్పడడం ఏమిటని గ్రామస్తులంతా ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం ఉదయం చందానగర్ ఎస్సై ఆంజనేయులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్తులపై దాడికి పాల్పడిన కార్తీక్, ప్రకాశం సింగ్ తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. బెల్ట్ షాప్ పై గలాటకు దిగిన ఘటనలో సురేందర్ తో పాటు మరో పదకొండు మందిపై కేసు నమోదు చేశారు. బెల్ట్ షాప్ లో మద్యంతో పాటు గంజాయి వెక్కిరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే గోపనపల్లి తండాలో వైన్ షాప్ వద్ద ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రధాన రహదారి వెంట బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ హల్చల్ చేస్తున్న వారిని కట్టడి చేయడంలో చందానగర్ పోలీసులు విఫలమయ్యారని స్థానికులు విమర్శిస్తున్నారు. అటు వైపు వెళ్లాలంటేనే మహిళలు జంతువుతున్నారని వాపోతున్నారు.
Cyber City NewsAdmin