సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : తెలంగాణలో అన్ని చెక్ పోస్టులను రద్దు చేస్తున్నట్లు రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులలో అవినీతి రాజ్యమేలుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెక్ పోస్టులను రద్దు చేస్తూ జూలైలో రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆలస్యంగా జీవో జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అన్ని చెక్ పోస్టులను రద్దు చేస్తున్నట్లు రవాణా శాఖ కమిషనర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. చెక్ పోస్ట్ లను మూసివేసి బోర్డులు, భారీకేడ్లు, సిగ్నేజులు తొలగించాలని జిల్లా రవాణా శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల్లోని చెక్ పోస్ట్ లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు చెక్పోస్టులను రద్దు చేశాయి. రోజులు గడుస్తున్నా చెక్ పోస్టులను మాత్రం తొలగించడం లేదు. అటు కేంద్రం ఆదేశాలు జారీ చేయడం, అవినీతి విమర్శలు రావడంతో చెక్ పోస్టుల రద్దు ప్రాధాన్యతను సంతరించుకుంది.
Cyber City NewsAdmin