సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్ అనిపించింది. శనివారం గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో బైక్ రేసింగ్ తో సందడిగా మారింది. ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ రౌండ్2 ఉత్సాహంగా కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి దాదాపు 40 నిమిషాల పాటు బైక్ రేస్ ను వీక్షించారు. రేసర్లు గాల్లో చేసిన విన్యాసాలు అందరిని అబ్బురపరిచాయి. రేసింగ్ లీగ్ లో రౌండ్ 2 పోటీలలో బైకర్లు తమ రైడింగ్ స్కిల్స్ తో హౌరా అనిపించారు. రేసింగ్ లీగ్ కోసం అథ్లెటిక్ స్టేడియం ఆవరణలో మట్టి కుప్పలతో అచ్చమైన రేసింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేశారు. రేసింగ్ ఈవెంట్ కు ముందు బైక్ షోకేస్ ఏర్పాటు చేసి రేసులో పాల్గొంటున్న బైకులను ప్రదర్శించారు. దీంతోపాటు రేసర్ల రైడర్ మీట్ నిర్వహించారు. ఎంటర్టైన్మెంట్ జోన్ లో భాగంగా నిర్వహించిన లైవ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
250 సీసీ ఇండియా అండ్ ఆసియా మిక్స్, 250సీసీ, 450 సీసీ ఇంటర్నేషనల్ కేటగిరిలో రేసర్లు పోటీ పడ్డారు. లీగ్ లో భాగంగా రేసర్లు ఒళ్ళు గగుర్పొడిచే ఫుల్ ట్రోటల్ స్టంట్ లు ప్రదర్శించారు. బీబీ రేసింగ్, గుజరాత్ ట్రయల్ బ్లాజర్, బిగ్ రాక్ మోటార్ స్పోర్ట్స్, ట్రై కలర్ కెటిఎమ్, ఇండి వీల్స్ వంటి టీమ్ లు పోటీపడ్డాయి. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు
Cyber City NewsAdmin