సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటే ఫ్లోరోసిస్ వ్యాధితో ఎముకలు గూళ్లుగా మారే ప్రమాదం ఉంది. నల్గొండ జిల్లాలో భూగర్భ జలాల్లో అత్యధికంగా ఫ్లోరైడ్, గద్వాల్ జిల్లాలో అత్యధికంగా క్లోరైడ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. నాగర్ కర్నూలు జిల్లాలోని జూపల్లి గ్రామంలో భూగర్భ జలాలను అత్యధికంగా నైట్రేట్ ఉన్నట్టు తెలింది.
విస్తుపోయే పరీక్షలు బి ఐ ఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ప్రమాణాల ప్రకారం మోతాదుకు మించి ఫ్లోరైడ్, క్లోరై డ్, నైట్రేట్ ఉంటే రోగాల బారిన పడే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా లీటర్ కి 5.84 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ ఉన్నట్లు హైదరాబాద్ రీజినల్ కెమికల్ లాబరేటరీ తేల్చింది. గద్వాల జిల్లాలో లీటర్ కి 250 మిల్లీగ్రా క్లోరైడ్, నాగర్ కర్నూల్ జూపల్లి గ్రామంలో లీటర్ కి 53 మిల్లీగ్రాముల నైట్రేట్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. తెలంగాణలో 19 శాతం జలాల్లో మోతాదుకు మించి ఫ్లోరైడ్ ఉన్నట్లు తెలుస్తోంది.
Cyber City NewsAdmin