సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / కర్నూలు : శ్రీశైలం మల్లన్న పై మంచి దుప్పటి గొడుగులా కప్పినా సుందర దృశ్యం కనువిందుగా మారింది. కార్తీక మాసం వేళ వేకువ జామున హర హర మహాదేవ శంభోశంకర అంటూ భక్తులు శివుడి సన్నిధికి చేరుకున్నారు. తెల్లవారుజామున ప్రకృతి రమణీయతగా పిలవబడే శ్రీశైలంలో మంచు పొరలు తెరలు తెరలుగా కనిపించాయి. అందాల కొండలో కొలువుదీరిన జ్యోతిర్లింగ, బ్రమరాంబ శక్తి పీఠానికి వెళ్లే భక్తులకు దట్టమైన మంచు స్వాగతం చెబుతూ పలకరించింది. భక్తిశ్రద్ధలతో అలంకరణ దర్శనం కోసం వెళుతున్న భక్తులు దారీ పొడవునా తెల తెలవారుతున్న చీకట్లు, విద్యుత్తు వెలుగు జిలుగులలో కప్పబడిన మంచు ఆహ్లాదాన్ని పంచిందనే చెప్పాలి.
శుక్రవారం సాయంత్రానికి శివుని స్పర్శ దర్శనం కోసం వేలాదిమంది భక్తులు క్యూ కట్టారు. శనివారం ఉదయాన్నే శ్రీశైలం మల్లన్న తో పాటు అమ్మవారు భ్రమరాంబిక తల్లిని దర్శించుకునేందుకు తరించిపోయారు. శివనామ స్మరణంతో ఆలయము దద్దరిల్లింది. వీకెండ్ కావడంతో భక్తులు తండోపతండాలుగా శివయ్యకు పూజలు చేసి తరించిపోయారు. సుందర సోయగాలు పంచె నల్లమల అడవి నీ కమ్మేసిన మంచు అపురూప దృశ్యంగా భక్తులు కొనియాడారు.
Cyber City NewsAdmin