Wednesday, 04 March 2026 11:55:01 AM
 BREAKING NEWS
     -> . 2200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా - 11 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం - మొండికుంట‌ చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌ - ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు..      -> హెచ్ సి యు లో 50 ల్యాప్ టాప్ల చోరీ సి ఆర్ రావు ఇనిస్టిట్యూట్ లో ఘటన సెక్యూరిటీ కళ్ళు కప్పి చోరీ ..      -> కూలిన విమానం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం బారామతిలో ల్యాండ్ అవుతుండగా ఘటన..      -> ఫాస్టాగ్ ఉంటేనే బండి కదులుతుంది ఏప్రిల్ ఒకటి నుంచి ఫాస్ట్ ట్రాక్ తప్పనిసరి ..      -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..

ఫాస్టాగ్ ఉంటేనే బండి కదులుతుంది ఏప్రిల్ ఒకటి నుంచి ఫాస్ట్ ట్రాక్ తప్పనిసరి


Date : 18 January 2026 10:39 PM Views : 118

సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద రద్దీ నివారణకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తుంది. టోల్ ప్లాజాల లో నగదు చెల్లింపులపై నిషేధం విధించనుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అన్ని నేషనల్ హైవే టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు పూర్తిగా నిషేధంకచనున్నట్లు తెలుస్తుంది. ఇకపై టోల్‌ చెల్లించడానికి ఫాస్టాగ్ ,యూపీఐ మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. హైవేలపై గంటల తరబడి నిలిచే రద్దీని తగ్గించి, ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి విప్లవాత్మక ముందడుగుగా భావించ వచ్చు. ప్రస్తుతం టోల్‌ ప్లాజాల వద్ద పండగ సమయంలో నగదు చెల్లింపులతో వాహనాలు క్యూ లో కిలోమీటర్ల తరబడి బారులు తీరుతున్నాయి. ట్రాఫిక్ రద్దీ తో బ్రేక్ వేసి, యాక్సిలరేట్ చేసి, మళ్లీ ఆగడం తో ఇంధనం వృథా అవుతోంది. కొత్త నిబంధనతో ఈ సమస్యలకు ఫుల్‌స్టాప్ పడుతుంది. భవిష్యత్తులో నో-స్టాప్ టోలింగ్ (బ్యారియర్ లేకుండా హైవే స్పీడ్‌లోనే ప్రయాణం) కూడా రానుందని సమాచారం. ప్రస్తుతం 25 టోల్ ప్లాజాల్లో ఇది పైలట్ ప్రాజెక్ట్‌గా జరుగుతోంది.

కేంద్రం తీసుకున్న ఈ మార్పులు అమల్లోకి రావడానికి కొన్ని నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ప్రయాణికులు ఇప్పటి నుంచే ఫాస్టాగ్ ను తీసుకొని సిద్ధపడితే ఏప్రిల్‌ నుంచి అవస్థలు తొలగిపోతాయి. ఫాస్టాగ్ లేని వారు తక్షణమే బ్యాంకు లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో యూపీఐ యాప్‌లు సిద్ధం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న వ్యాపారుల్లో ఇంకా డిజిటల్ చెల్లింపులకు అలవాటు లేని వారికి ఇది కొంత ఇబ్బందికరంగా అనిపించవచ్చు. కానీ ప్రభుత్వం ఈ విషయంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. నగదు రహిత టోల్ వసూళ్లతో ఇంధన ఆదా, తక్కువ కాలుష్యం, పారదర్శకత, వేగవంతమైన ప్రయాణాలు.. ఇవన్నీ ఒకేసారి సాధ్యమవుతున్నాయని చెబుతున్నారు. ఇది కేవలం టోల్ ప్లాజా మార్పు మాత్రమే కాదు.. ఇది భారత రహదారుల భవిష్యత్తుకు కొత్త అధ్యాయంగా మారుతుందని విశ్వసిస్తున్నారు. ఇక హైవేల మీద ప్రయాణం.. సాఫీగా.. సులభంగా జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

Cyber City News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2026. All right Reserved.