సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పేగు బంధాన్ని తెంచుతూ శిశువుల కొనుగోలుకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. 11 మంది ముఠా సభ్యులను మియాపూర్, ఎస్విటి శంషాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు మాదాపూర్ డిసిపి రితిరాజ్ తెలిపారు. వేముల బాబు రెడ్డి, వెంకిపల్లి గంగాధర్ రెడ్డి, దారం లక్ష్మి, కుమ్మరి హర్షరాయ్, సంగీత దేవి, గూడెపు సుజాత, సురబోయిన అనురాధ, కీసరపు జ్యోతి, వి. మాధవి పోతుల శోభ లను అరెస్టు చేశారు. నిందితులనుంచి పది రోజుల వయస్సు కలిగిన ఇద్దరు మగ శిశువులను రెస్క్యూ చేసి శిశు విహార్ కు తరలించారు.
అహ్మదాబాద్ లో లేబర్ కాలనీలో ఓ పేద కుటుంబాన్ని ఎంపిక చేసుకొని మూడు లక్షలు చెల్లించి బాబురావు ఏజెంట్లు పది రోజుల మగ శిశువును నగరానికి తీసుకొచ్చారు. గంగాధర్ రెడ్డి అనుచరులు సిద్దిపేట జిల్లా రామాయంపేటలో కూలీ పనులు చేసే కుటుంబానికి మూడు లక్షలు ఎరగా వేసి పది రోజుల వయసు నా మగ శిశువును కొనుగోలు చేశారు. ఏడు లక్షల రూపాయలకు పిల్లలు లేని దంపతులతో బేరం కుదుర్చుకున్నారు. చిన్నపిల్లల అక్రమ రవాణా కేసులో బాబు రెడ్డి పై మూడు, గంగాధర్ రెడ్డి పై ఐదు కేసులు ఉన్నాయి. నిందితులను కస్టడీలోకి తీసుకుని ఐవీఎఫ్, సరోగసి కేంద్రాలతో సంబంధాలపై విచారణ చేపడతామని డిసిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టి డి సి పి రాజేష్, మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ శివప్రసాద్ ఉన్నారు.
Cyber City NewsAdmin