సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : గచ్చిబౌలిలోని టీఎన్జీవో ఎస్ కాలనీలోని ఓ పి జి హాస్టల్ లో 32 గ్రాముల ఎండిఎంఏ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ ఎం లగ్జరీ పీజీ కో లివింగ్ లో తేజ కృష్ణ, లోకేష్ రెడ్డి ల వద్ద డ్రగ్ ఉందన్న సమాచారంతో సోమవారం గచ్చిబౌలి పోలీసులు మాదాపూర్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా మాదాపూర్ లోని నైట్ ఐ హోటల్ వెన్నెల రవి కిరణ్ అలియాస్ భాను, హర్షవర్ధన్ రెడ్డి, మన్నె ప్రశాంత్, షాజీర్ లను అదుపులోకి తీసుకున్నారు. రెండు చోట్ల నిందితుల నుంచి 32.14 గ్రాముల ఎండిఎంఏ, 4.67 గ్రాముల గాంజాయి స్వాధీనం చేసుకున్నారు. మీరిచ్చిన సమాచారంతో మరో ఐదుగురిని అదుపులోకి తీసుకొని మొత్తం 11 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇద్దరు నైజీరియన్లతో పాటు మరో 9 మంది డ్రగ్స్ peddlers కన్జ్యూమర్స్ పరారీలో ఉన్నారు.
బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నట్లుగా పోలీసులు మాదాపూర్ ఏ డి సి పి ఎన్. ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరు నైజీరియన్ ల నుంచి పెడ్లర్స్ డ్రగ్ కొనుగోలు చేసి ఐటి కారిడార్ లో విక్రయిస్తున్నారు. తేజ కృష్ణ, షాజీర్ బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మేందుకు సిద్ధంగా ఉంచారు. నైజీరియన్లు పట్టుబడితే ఎక్కడెక్కడ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. మాదాపూర్ జోన్ లోని పీజీ హాస్టల్స్ లో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహిస్తామని ఏ డి సి పి తెలిపారు.
Cyber City NewsAdmin