సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : గచ్చిబౌలి: ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు జారి పడటంతో బాలుడు మృతి చెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నేపాల్ కు చెందిన దంపతులు మహేందర్ రావు, నిర్మల బతుకు దెరువు కోసం నగరానికి వలస వచ్చారు. మసీద్ బండ లోని పారామౌంట్ హిల్స్ కాలనీ ది క్లబ్ మినీ గేటెడ్ కమ్యూనిటీలో వాచ్మెన్ గా పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 2.53 గంటల సమయంలో మహేందర్ కొడుకు సూరజ్ రోత్ (04) ఆడుకుంటూ బయటకు వెళ్లాడు. ఆడుకుంటూ వెళుతూ ప్రమాదవశాత్తు జారి స్విమ్మింగ్ పూల్ లో పడ్డాడు. కొద్ది సేపటి తరువాత ఇంట్లో లేకపోవడంతో తల్లి నిర్మల కొడుకు సూరజ్ కోసం వెతికింది. స్విమ్మింగ్ పూల్ లో పడి ఉండటాన్ని గమనించి బయటకు తీశారు .
వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు అక్కడి వైద్యులు దృవీకరించారు. ఒక్కగా నొక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు గా విలపించారు. బాలుడు మృతదేహనికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆడుకుంటూ వెళ్లి బాలుడు స్విమ్మింగ్ పూల్లో పడ్డట్లు సీ సీ కెమెరా ఫుటేజ్ లో ఉందని. పోలీసులు తెలిపారు. స్విమ్మింగ్ పిల్లలు పూల్ వైపు వెళ్ళకుండా రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు.
Cyber City NewsAdmin