Wednesday, 04 March 2026 11:55:02 AM
 BREAKING NEWS
     -> . 2200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా - 11 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం - మొండికుంట‌ చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌ - ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు..      -> హెచ్ సి యు లో 50 ల్యాప్ టాప్ల చోరీ సి ఆర్ రావు ఇనిస్టిట్యూట్ లో ఘటన సెక్యూరిటీ కళ్ళు కప్పి చోరీ ..      -> కూలిన విమానం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం బారామతిలో ల్యాండ్ అవుతుండగా ఘటన..      -> ఫాస్టాగ్ ఉంటేనే బండి కదులుతుంది ఏప్రిల్ ఒకటి నుంచి ఫాస్ట్ ట్రాక్ తప్పనిసరి ..      -> చైనా మాంజా తాకి యువకుడికి తీవ్ర గాయం యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఘటన..      -> మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ఇక్ఫాయ్ విద్యార్థులు మృతి యువతకి తీవ్ర గాయాలు ..      -> గోపన్ పల్లి లో బెల్ట్ షాపు వద్ద గలాట ఇరు వర్గాలు పరస్పర దాడులు 18 మంది పై కేసు నమోదు..      -> జిహెచ్ఎంసి వార్డుల డిలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల 12 జోన్లు 60 సర్కిళ్లకు పెంచుతున్నట్లు ప్రకటన ..      -> ఆ ఊర్లో మహిళలు, బాలికలు స్మార్ట్ ఫోన్ల వాడకం పై నిషేధం - జనవరి 26 నుంచి అమలు..      -> అంగట్లో సరుకుల్లా శిశువుల అక్రమ రవాణా - మియాపూర్ లో పట్టుబడ్డ 11 మంది సభ్యుల ముఠా - అహ్మదాబాద్, రామాయంపేటలో శిశువుల కొనుగోలు ..      -> చందా నాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ 44 మంది విద్యార్థులకు అస్వస్థత..      -> దేవుని మాన్యం లో కాసుల వల బడా బిల్డర్ డబ్బు పంపిణీ తో ఊరంతా పండగే..      -> గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ లో 25 మంది మృతి, ఆరుగురికి గాయాలు ..      -> ప్రయాణికులకు రూ.610 కోట్లు చెల్లించిన ఇండిగో విమాన సంస్థ..      -> ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అదుర్స్..      -> కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా ... 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌..      -> సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, 45 మంది మృతి ఒక ఇంట్లో 18 మంది మృతి ...మృతులంతా హైదరాబాదు వాసులే..      -> శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలు కూల్చివేత ... అంతర్గత రోడ్లకు అడ్డంగా నిర్మించిన భవనాలపై హైడ్రా కొరడా..      -> జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం. టిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై 24,729 ఓట్ల మెజారిటీ ..      -> ఢిల్లీలో భారీ పేలుడు... 9 మంది మృతి ... ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద i20 కారులో పేలుడు ..

. 2200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా - 11 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం - మొండికుంట‌ చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌ - ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు


Date : 13 February 2026 08:56 PM Views : 33

సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : ఐటీ కారిడార్ లోని హైటెక్స్ ఎగ్జిబిష‌న్ సమీపంలో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌ చేపట్టింది. గురువారం వంద‌లాది తాత్కాలిక షె డ్డుల‌ను, ప‌దుల సంఖ్య‌లో ఉన్న షాపుల‌ను తొల‌గించింది. మొండి కుంట ఆక్ర‌మ‌ణ‌ల‌ను నేలమట్టం చేసింది. మొండికుంట, ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. చెరువుతో పాటు.. ప‌క్క‌నే ఉన్న ప్ర‌భుత్వ భూమి ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి 11 ఎక‌రాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ. 2200 ల కోట్లు ఉంటుందని హైడ్రా తెలిపింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ స‌ర్వే నంబ‌రు 53లోని మొండికుంట‌తో పాటు.. స‌ర్వే నంబ‌రు 55లోని ప్ర‌భుత్వ భూమి ఎక‌రాల‌ కొద్దీ ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి అవుతోంద‌ని అక్క‌డి నివాసితులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ గారి ఆదేశాల‌మేర‌కు రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారుల‌తో క‌లిసి హైడ్రా క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టింది. దాదాపు 11 ఎక‌రాలు క‌బ్జాకు గురైన‌ట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఆల‌యాన్ని హ‌ద్దుగా చూపించి క‌బ్జాదారులు ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డిన‌ట్టు నిర్ధారించారు. ఆల‌యం హ‌ద్దుగా ప‌లు షాపులు, మెకానిక్ షెడ్డులు, ఐర‌న్ స్టీల్ షాపు ఇలా అనేక రకాల వ్యాపార సముదాయాలు ఉన్నట్లు గుర్తించారు. 30కి పైగా ఉన్న షాపుల ద్వారా నెల‌కు రూ. ల‌క్ష‌ల్లో అద్దెలు వ‌సూలు చేస్తున్నట్లు తెలిపింది.

మొండికుంట‌తో పాటు.. అక్క‌డ ఉన్న ప్ర‌భుత్వ భూమి ఆక్ర‌మ‌ణ‌ల‌పై జ‌న‌వ‌రి 31న హైడ్రా విచార‌ణ కూడా చేప‌ట్టింది. రెవెన్యూ అధికారుల‌తో పాటు.. క‌బ్జాల‌కు పాల్ప‌డిన వారు కూడా ఈ స‌మ‌వేశంలో పాల్గొన్నారని తెలిపారు. వారి స‌మ‌క్షంలోనే ఆక్ర‌మ‌ణ‌లు జ‌రిగిన‌ట్టు రెవెన్యూ అధికారులు స్ప‌ష్టం చేశారు. అలాగే ఎన్ ఆర్ ఎస్ సీ శాటిలైట్ చిత్రాల‌ను ప‌రిశీలించి కూడా ఆక్ర‌మ‌ణ‌లు జ‌రిగిన‌ట్టు నిర్ధారించారు. ఇదే విష‌యాన్ని క‌బ్జాదారుల‌కు తెలియ‌జేశారు. వారికి కొంత స‌మ‌యాన్ని ఇచ్చి గురువారం హైడ్రా ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించే ప‌నిని చేప‌ట్టింది. వంద‌ల సంఖ్య‌లో ఉన్న తాత్కాలిక షెడ్డుల‌ను భారీ బందోబ‌స్తు మ‌ధ్య హైడ్రా తొల‌గించింది. మొండికుంట చెరువును కాపాడినందుకు అక్క‌డ స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ భూమిలో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించిన చోట పార్కుల‌ను అభివృద్ధి చేయాల‌ని స్థానికులు హైడ్రా అధికారుల‌ను కోరారు. చెరువును అభివృద్ధి చేసి సుంద‌రీక‌రించాల‌ని సూచించారు.

Cyber City News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Cyber City News 2026. All right Reserved.