సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మిర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మితిమీరిన వేగంతో కారు చెట్టును ఢీకొట్టడంతో నలుగురు ఇక్ఫాయ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక్ఫాయ్ యూనివర్సిటీకి చెందిన బీబీఏ విద్యార్థులు కర్గయాల సుమిత్ (20), శ్రీ నిఖిల్ (20), బల్మూరి రోహిత్ (18), దేవాల సూర్య తేజ (20), సుంకరి నక్షత్ర లు బర్త్డే పార్టీ చేసుకునేందుకు యూకో స్పోర్ట్స్ కార్ లో కోకాపేటకు వెళ్లారు. అర్ధరాత్రి 1.40 గంటల సమయంలో తిరిగి యూనివర్సిటీకి వస్తున్నారు. మితిమీరిన వేగంతో వస్తూ మిర్జాగూడ కేటు వద్ద చెట్టును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో సుమిత్, నిఖిల్ , సూర్యతేజ, రోహిత్ లు దుర్మరణం పాలయ్యారు. మరో విద్యార్థిని నక్షత్ర కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మోకిలా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థులు ఎవరి బర్త్డే వేడుకలకు వెళ్లారు, మద్యం మత్తులో కారు నడిపారు అనే విషయాలు తెలియాల్సి ఉంది.
Cyber City NewsAdmin