సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు మృతి చెందారు. మృతుల్లో మల్లెపల్లి,బజార్ ఘాట్, విద్యానగర్ కు చెందిన వారు ఉన్నారు. హైదరాబాద్ నుంచి మక్కాకు బయలుదేరారు. మెహిదీపట్నంలోని ఫ్లై జోన్ ఏజెన్సీ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని నవంబర్ 9న మక్కాకు వెళ్లారు. మక్కా యాత్ర పూర్తి చేసుకుని మదినకు వెళ్తున్న సమయంలో ట్రావెల్ బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు మంటల్లో కాలిపోవడంతో హైదరాబాద్ వాసులంతా సజీవ దహనం అయ్యారు. మృతుల్లో మరియు ఫాతిమా, సారావేగం, షహనాజ్ బేగం, షాకత్ బేగం, మహమ్మద్ మౌలానా, సారా మహమ్మద్, సహజిన్ బేగం, సలావుద్దీన్ షేక్, మస్తాన్ మహమ్మద్, జాకియా బేగం, మహమ్మద్ అలీ జిర్రా, రహీమున్నీసా, గౌసియా బేగం, అత్తర్ బేగం, నసీరుద్దీన్ షేక్, అబ్దుల్ కదిర్, అబ్దుల్ సోహెబ్ మహమ్మద్, ఉమేరా నాజ్నిన్, రైస్ బేగం, ఉమేజా ఫాతిమా, సనా సుల్తానా, రిజ్వానా బేగం, ఫార్విన్ బేగం ఉన్నారు.
సౌదీ అరేబియా లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాదులోనే విద్యానగర్కు చెందిన నజీరుద్దిన్ కుటుంబంలో 18 మంది మృతి చెందారు. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి అయిన నజీరుద్దీన్ కుటుంబ సభ్యులతో కలిసి మక్కా యాత్రకు వెళ్లారు. ఒకే కుటుంబంలో 18 మంది మృతి చెందడాన్ని వారి బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాధ్యత కుటుంబ బంధువులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. సౌదీ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల పరిహారం ప్రకటించింది. మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన అధికారితో కూడిన బృందాన్ని సౌదీకి పంపించాలని సూచించింది. మృతదేహాలకు వారి సాంప్రదాయాల ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు చొప్పున తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
Cyber City NewsAdmin