సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : అంగన్ వాడి కేంద్రానికి వెళ్లిన ఓ బాలుడు శవమై సంపులోకి తేలాడు. నానక్ రామ్ గూడ లోని అంగన్వాడీ కేంద్రంలో ఘటన చోటు చేసుకుంది. టీఎన్జీవోస్ కాలనీలో నివాసముండే పరమేశ్వర్ బ్లింక్ ఇట్ డెలివరీ రైడర్ గా పని చేస్తున్నాడు. చిన్న కొడుకు నిఖిల్ తేజ (04) ను ఉదయం 9 గంటలకు నానక్ రామ్ గూడ లోని అంగన్వాడీ కేంద్రంలో వదిలి వెళ్లారు. సాయంత్రం 3.50 గంటలకు ఆటో డ్రైవర్ అంగన్వాడి కేంద్రానికి వెళ్లి పిల్లలను తీసుకొని వెళ్లాల్సి ఉంది. నిఖిల్ తేజ కనిపించకపోవడంతో తండ్రికి సమాచారం ఇచ్చారు. అంగన్వాడి కేంద్రానికి వచ్చిన తండ్రి పరమేశ్వర్ సమీప ప్రాంతాల్లో గాలించిన కనిపించలేదు. అనుమానం వచ్చి సంపు మూత తీసి చూడగా నిఖిల్ తేజ శవమై నీటిపై తేలియాడుతూ కనిపించాడు.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కొడుకు నీటి సంపులో పడి మృతి చెందడంతో తల్లిదండ్రులు పరమేశ్వర్, సంధ్యారాణి గుండెల విసేలా విలపించారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే కొడుకు చనిపోయాడని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు.
Cyber City NewsAdmin