సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : ఇండిగో సంస్థ విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రంలోపు ప్రయాణికులకు టికెట్ డబ్బులు రీఫండ్, రెండు రోజుల్లో 3000 లగేజీలు డెలివరీ చేయాలని శనివారం కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఇండిగో దిగి వచ్చినదని చెప్పాలి. ప్రయాణికుల టికెట్లు రీషెడ్యూల్ చేయడానికి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయొద్దని ఇండిగో యాజమాన్యానికి కేంద్రం ఆదేశించింది. దీంతో రీఫండ్ ప్రక్రియను 610 కోట్లు చెల్లించి పూర్తి చేసింది. సంక్షోభం నుండి బయటపడడంతో పాటు సర్వీసుల పునరుద్ధరణకు క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఇండిగో సంస్థ నిర్ణయించింది.
ఇండిగో సంస్థ తాజా నిర్ణయంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సర్వీసులను పునరుద్ధరిస్తే విమానయాన చార్జీలు తగ్గే అవకాశం ఉంది.
Cyber City NewsAdmin