సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఒక్క ఛాన్స్ ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఆదివారం రాత్రి బొరబండలో కార్నర్ మీటింగ్ లో సీఎం ప్రసంగించారు. బోరబండ సమస్యల పరిష్కారానికి నవీన్ యాదవ్ కృషి చేస్తారని తెలిపారు. బిజెపి టిఆర్ఎస్ పార్టీలు కుమ్ముకై రాజకీయాలు చేయడాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.
చెల్లికి అన్నం పెట్టని వ్యక్తి చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేయిస్తాడాని ఆయన ప్రశ్నించారు. చెల్లె కవితకు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లో నుంచి బయటకు పంపారని పేర్కొన్నారు. బోరబండ చౌరస్తాను పీజెఆర్ చౌరస్తాగా మారుస్తామన్నారు. పి జె ఆర్ విగ్రహం ఏర్పాటు చేసి జూబ్లీహిల్స్ సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు కేటాయిస్తామని, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత తనదేనన్నారు. మోడీ ఏమి ఇచ్చారని జూబ్లీహిల్స్ లో బిజెపి నాయకులు ప్రచారానికి వస్తారని సీఎం ప్రశ్నించారు. మూడుసార్లు మోదీ ప్రధానమంత్రి, రెండుసార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రేషన్ కార్డులు ఇచ్చారా అని ఆయన గుర్తు చేశారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు, సన్న బియ్యం ఇచ్చారా అని పెద్దవ చేశారు. ఈ కార్యక్రమంలో పీసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అజారుద్దీన్ నాయకులు పాల్గొన్నారు.
Cyber City NewsAdmin