సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడితేనే బస్తీ దవాఖాన ఉద్యోగులకు జీతాలు వస్తాయని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బస్తి దావఖానాలకు సుస్తీ పట్టిందని ఆయన విమర్శించారు. మంగళవారం శేర్లింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు . ఆసుపత్రిలోని సౌకర్యాలు, మందులు, ఉద్యోగుల జీతాలపై ఆరా తీశారు. డాక్టర్లకు రెండు నెలలుగా, స్టాఫ్ నర్స్ కు ఐదు నెలలుగా, సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మాజీ మంత్రి వద్ద గోడు వెల్లబోసుకున్నారు.
బస్తీ దవాఖానాలకు సుస్తీ నెల నెల జీతాలు ఇవ్వకుంటే పేదలకు వైద్యం చేసే డాక్టర్లు సిబ్బంది ఎలా విధులు నిర్వహిస్తారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 450 బస్తీ దవాఖానలు, హైదరాబాదులో 350 దవాఖానలు ఏర్పాటు చేసిందన్నారు. 110 రకాల మందులను ఉచితంగా అందజేసి, 134 రకాల పరీక్షలు చేసి రోగుల మొబైల్ ఫోన్స్ కు పంపించేది అన్నారు. 60, 70 రకాల మందులు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బస్తీ దవాఖానాలను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కెసిఆర్ కిట్ ను పేరు మార్చి ఇచ్చి పేదలను ఆదుకోవాలనీ సూచించారు. ఒకటో తారీకు న జీతాలు ఇస్తున్నామన్న ప్రభుత్వం వాస్తవాలను పరిగణలోకి తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం మళ్లీ నల్లా బిల్లులు, కరెంట్ బిల్లులను పంపుతుందని జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు.
Cyber City NewsAdmin