సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) ఆధ్వర్యంలో ఉమెన్స్ నైట్ రన్ నిర్వహించారు. శనివారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో 5వ ఎడిషన్ స్టార్‌లైట్ స్ట్రైడ్స్ – ఉమెన్స్ నైట్ రన్ ఉత్సాహంగా సాగింది. ఉమెన్ సేఫ్టీ డీసీపీ సృజన, కలామందిర్ డైరెక్టర్ కళ్యాణ్ , హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ లు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. మహిళల కోసం నిర్వహించిన ఈ రాత్రి పరుగు లో పాల్గొనడం చాలా ప్రేరణ ఇచ్చిందని డీసీపీ సృజన అన్నారు10కే టైమ్డ్ రన్, 5కె టైమ్డ్ రన్, మరియు 5కె ఫన్ రన్ లో వివిధ వయస్సుల మహిళలు పాల్గొన్నారు.
విమెన్స్ కౌచ్25కె ఇది హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ రూపొందించిన 6 వారాల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం. 180 మంది మహిళలు తమ 5కె గ్రాడ్యుయేషన్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. మార్గదర్శకులైన 22 మంది మహిళా మెంటర్స్‌ను సత్కరించారు. కాంచీపురం వరమహాలక్ష్మీ సిల్క్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఇన్ సారీ, విన్ బిగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
Cyber City NewsAdmin