సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : ఆదివారం ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన సదరు ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు.సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర పోషిస్తున్నారని అభిప్రాయపడ్డారు. యాదవులకు ప్రభుత్వంలో తగిన ప్రాతినిథ్యం, సముచిత స్థానం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. నమ్మిన వారికోసం ఎంత కష్టమొచ్చినా, నష్టమొచ్చినా యాదవులలో అండగా అండగా నిలబడే తత్వం ఉందన్నారు.
ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ నగరంగా మారిందని తెలిపారు. అన్ని వర్గాల సహకారంతో హైదరాబాద్ ను మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు , ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో పాటు సదర్ సమ్మేళన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Cyber City NewsAdmin