సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జోన్లు, సర్కిల్ సంఖ్యను పెంచుతూ అధికారికంగా తుది నోటిఫికేషన్ను గురువారం రాత్రి విడుదల చేసింది. కొత్తగా ఏర్పాటైన జోన్లలో ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్ గిరి, శంషాబాద్ ,రాజేంద్రనగర్, గోల్కొండ ఉన్నాయి. కొత్త జోన్లలో ప్రత్యేక జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. వార్డ్ ఆఫీసుల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. జిహెచ్ఎంసి వార్డుల డీ లిమిటేషన్ తుది నోటిఫికేషన్ లోక్ 300 వార్డులను ఖరారు చేశారు. డిసెంబర్ 9న ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు 10 రోజులపాటు అభ్యంతరాలను స్వీకరించారు. 6000 పైగా వచ్చిన అభ్యంతరాలలో సహేతుకమైన వాటిని పరిగణలోకి తీసుకొని ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం సర్కిల్ ల సంఖ్యను పెంచడంతోపాటు జోనల్ కార్యాలయాల సంఖ్యను పెంచారు.
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా హేమంత్ సహదేవరావు, కూకట్పల్లి జోనల్ కమిషనర్ గా అపూర్వ చౌహాన్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ గా సందీప్ సుల్తానియా, చార్మినార్ జోనల్ కమిషనర్ గా ఎస్. శ్రీనివాసరెడ్డి ,గోల్కొండ జోనల్ కమిషనర్ గా జి. ముకుంద రెడ్డి ,ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ప్రియాంక, రాజేంద్రనగర్ కమిషనర్ గా అనురాగ్ జయంతి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ గా ఎస్ రవి కిరణ్, శంషాబాద్ జోనల్ కమిషనర్ గా కే.చంద్రకళ ,ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గా హేమంత్ కేశవ్ పాటిల్, మల్కాజ్ గిరి జోనల్ కమిషనర్ గా సంచిత్ గంగ్వార్, ఉప్పల్ జోనల్ కమిషనర్ గా రాధిక గుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Cyber City NewsAdmin