సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : సైబర్ సిటీ న్యూస్ (హైదరాబాద్): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో వినియోగించబోయే ఏలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (EVMs) కు సంబంధించి మొదటి రాండమైజేషన్ ప్రక్రియ చాదర ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ (VPG) కేంద్రంలో చేపట్టారు. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఆధ్వర్యంలో నోడల్ అధికారులు అపూర్వ చౌహాన్, హేమంత్ కేశవ్ పాటిల్, రిటర్నింగ్ అధికారి పి సాయిరాం లు పర్యవేక్షించారు.
రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కంప్యూటరైజ్డ్ విధానంలో ఈ రాండమైజేషన్ పారదర్శకంగా నిర్వహించబడింది. ఈ ప్రక్రియలో ఫస్ట్ లెవెల్ చెకప్ ( ఎఫ్‌ఎల్‌సీ ) ఒకే అయిన యూనిట్లను రాబోయే ఉప ఎన్నికలో వినియోగం కోసం నిష్పక్షపాతంగా కేటాయించడం జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రక్రియలో ప్రతి దశ ఎన్నికల కేంద్ర సంఘం మార్గదర్శకాలు ప్రకారం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని తెలిపారు. సంబంధిత అధికారులు ఎన్నికల ప్రక్రియ నియమాల్ని సుజాత తప్పకుండా పాటించాలని
Cyber City NewsAdmin