సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : హైటెక్ సిటీ లోనే చందనాయక్ తాండ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. విద్యార్థులు వరుసగా వాంతులు చేసుకోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నిర్మాణ సంస్థ విద్యార్థులకు శుక్రవారం ఉదయం మైసూర్ బోండా, చట్నీ,పాలు అందించారు. అక్షయపాత్ర మధ్యాహ్నం రైస్, పప్పు ,ఆలూ కర్రీ, సేమియా స్వీట్ పెట్టారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. దీంతో ఆందోళనకు గురైన ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు సమావేశం చేరవేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాలతో ఆర్బీఎస్ కె వాహనాల్లో విద్యార్థులను కొండాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మన గ్రామంలోని రెయిన్బో ఆస్పత్రికి తరలించారు. 107 మంది విద్యార్థులు హాజరుకాగా 44 మంది అస్వస్థకు గురయ్యారు.
విద్యార్థుల ఆరోగ్యము నిలకడగా ఉందని రంగారెడ్డి జిల్లా వైద్య అధికారిని డాక్టర్ లలితా తెలిపారు. ఆహారం నీరు కలుషితం కారణంగానే విద్యార్థులు అస్వస్థకు గురై ఉంటారని ఆమె పేర్కొన్నారు. శాంపిల్స్ ను జిహెచ్ఎంసి అధికారులు సేకరించారని కారణం తెలియాల్సి ఉందన్నారు. విద్యార్థులంతా డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ఆరోగ్యం మెరుగైన తర్వాత డిశ్చార్జ్ చేస్తామన్నారు.
Cyber City NewsAdmin