సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని ఓ ఇంట్లో 43 ఓట్లు ఉన్నట్లు జిహెచ్ఎంసి ఉద్యోగులు గుర్తించారు. యూసుఫ్ గూడా కృష్ణానగర్ లో 8-3-231/ బి/160 ఇంటిని ఎన్నికల అధికారులు సందర్శించారు. ప్రస్తుతం ఆ ఇంట్లో ముగ్గురు మాత్రమే ఉండగా అదనంగా 40 ఓట్లు గుర్తించారు. గతంలో ఆ ఇంట్లో అద్దెకు ఉన్న సినీ పరిశ్రమకు చెందినవారు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లారు. వారు వేరేచోట నివాసం ఉంటూ అక్కడే ఓట్లు వేస్తున్నారు.
కృష్ణానగర్ లో గుర్తించిన ఓటర్ల స్థానంలో వేరే వ్యక్తులు ఓటింగ్ వేసే అవకాశం ఉంటుంది. నివాసం లేని లేని వ్యక్తులకు ఓట్లు ఉన్నట్లు గుర్తించినా అవి తొలగించలేదు. సంబంధిత ఓటర్ల అనుమతి ఉంటేనే బి ఎల్ ఓ లో తొలగించే అవకాశం ఉంటుంది. అప్పటివరకు ఓటర్ లిస్టులో ఆ ఓట్లు అలానే ఉంటాయి. దీనిపై ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు జిహెచ్ఎంసి అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లి ఓటరు నమోదు చేసుకుంటే ఆ ఓటరు స్వచ్ఛందంగా పాత ఓటును తొలగించాలని కోరడం అతని విధి. అలా కాకుండా చాలా మంది రెండు చోట్ల వివిధ సందర్భాలలో యధేచ్ఛగా ఓట్లు వేస్తున్నారు. దుబారా ఓట్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.
Cyber City NewsAdmin