సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : సెల్ ఫోన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న దొంగలు కత్తితో దాడికి యత్నించగా సౌత్ ఈస్ట్ డిసిపి చైతన్య కాల్పులు జరిపారు. హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో మీటింగ్ కు హాజరై తిరిగి డిసిపి తన కార్యాలయానికి వెళ్తున్నాడు. చాదర్ఘాట్ సమీపంలో సెల్ ఫోన్ స్నాచింగ్ కు పాల్పడిన ఇద్దరు దొంగలు పారిపోతున్నట్లు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు డిసిపి చైతన్య ప్రయత్నించగా ఓ దొంగ కత్తితో దాడి చేయబోయాడు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో గన్ మెన్ కింద పడిపోయారు. గన్మెన్ వెపన్ ను తీసుకొని దొంగలపై డిసిపి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఒకరికి గాయాలు
డిసిపి చైతన్య జరిపిన కాల్పులలో ఓ దొంగకు చాతి వెన్ను భాగంలో బుల్లెట్ గాయాలైనట్లు తెలుస్తోంది. తప్పించుకునే క్రమంలో దొంగ భవనం పైనుంచి విక్టరీ మైదానంలోకి దూకడంతో తీవ్ర గాయాల పాలై పోలీసులకు చిక్కాడు. బంజారా హిల్స్ లోని ఆసుపత్రిలో దొంగకు చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలతో డిసిపి చైతన్య మలక్పేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన స్థలాన్ని సౌత్ జోన్ డిసిపి స్నేహ మెహ్రా, సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి పరిశీలించారు.
Cyber City NewsAdmin