సైబర్ సిటీ న్యూస్ - జాతీయం / హైదరాబాద్ : మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్ కి చేరింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 5 వికెట్ల తేడాతో ఆసీస్ ను ఓడించింది. గురువారం నవీ ముంబైలో జరిగిన రెండవ సెమీఫైనల్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 338 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 5 వికెట్లకు 341 పరుగులు చేసింది.
జమీమా రోడ్రిక్స్(127) నాటౌట్ గా నిలిచింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (89) పరుగులు చేసింది. నిర్ణీత లక్ష్యాన్ని 48.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేదించింది. నవంబర్ 2న జరిగే ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తో భారత్ తలపడనుంది. ఆస్ట్రేలియా ఓపెనర్ లీచ్ ఫీల్డ్ (119), ఎలిస్ ఎలిస్ పెర్రీ(77), గార్డెనర్ 63తో రాణించారు. 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి ఆసీస్ అలౌట్ అయ్యింది.
Cyber City NewsAdmin