సైబర్ సిటీ న్యూస్ - జాతీయం / హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు నిరాకరించింది. గురువారం ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల పేరిట జీవో నెంబర్ 9 జారీ చేసింది. జీవో పై తెలంగాణ హైకోర్టు స్టే విధిస్తూ విచారణ ఆరువారాలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని సుప్రీంకోర్టు సూచించింది. రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సంగ్వీ వాదనలు వినిపించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒకటి పకడ్బందీగా సర్వే నిర్వహించామని గవర్నర్ బిల్లు పెండింగ్ లో ఉందన్నారు. సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని కోర్టుకు విన్నవించారు. హైకోర్టు స్టే ఇచ్చిందని మధ్యంతర తీర్పులో ఎలాంటి సహేతుక కారణాలు లేవని అన్నారు.
ప్రతివాది మాధవరెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపిస్తూ 50 శాతానికి రిజర్వేషన్లు మించి ఉండకూడదని సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో స్పష్టం చేసిందన్నారు. గిరిజన ప్రాంతాలలో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేసేందుకు వీలుందని తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ప్రాంతాలు లేవన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పెంపును తిరస్కరించిందని గుర్తు చేశారు.
Cyber City NewsAdmin