సైబర్ సిటీ న్యూస్ - జాతీయం / హైదరాబాద్ : కామన్ వెల్త్ గేమ్స్ ను దక్కించుకున్న భారత్ క్రీడా సంగ్రామానికి భారత్ అంతర్జాతీయ వేదిక కాబోతోంది. 100 సంవత్సరాల శతాబ్ది ఎడిషన్ నిర్వాహణను భారత్ దక్కించుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన 2030 కామన్వెల్త్ గేమ్స్ కు అహ్మదాబాద్ వేదిక కానుంది. శతాబ్ది ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ బిడ్ దాఖలు చేయగా కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ బుధవారం ఆమోదించింది. ఒలంపిక్స్ తరువాత ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రీడా సంగ్రామంగా కామన్వెల్త్ గేమ్స్ ను పరిగణిస్తారు.
అహ్మదాబాద్ లో.... గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియం 1,32,000 సామర్థ్యం కలిగి ఉంది. నైజీరియాలోని అబూజా నగరంతో పోటీపడి అహ్మదాబాద్ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది. నవంబర్ 26న అధికారికంగా ప్రకటించనున్నారు. కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులను భారత్ రెండోసారి దక్కించుకుంది. ఢిల్లీ వేదికగా 2010లో తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించారు. 1930లో ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ 2030తో శత వసంతాలు పూర్తి చేసుకుంటాయి.
Cyber City NewsAdmin